Header Banner

రూ.5 లక్షల్లో ఫ్యామిలీకి ఫుల్ సేఫ్టీ, స్టైలిష్ కార్.. 28.06 కి.మీ మైలేజ్‌తో పాటు..

  Tue Apr 29, 2025 17:18        Auto

ఇండియాలో కార్ల వినియోగదారుల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఇప్పుడు కేవలం తక్కువ ధరలో కారు వస్తుందా అనేది కాకుండా, భద్రత, డిజైన్, మైలేజ్, టెక్నాలజీ వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతున్నారు. అలాంటి వాటిలో టాటా మోటార్స్‌కు చెందిన ప్రసిద్ధ కారు టియాగో (Tiago) ఒకటి. ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు పదేళ్లు పూర్తయినా, ఇంకా అమ్మకాల్లో దుమ్ము రేపుతుంది. టియాగో ఒక ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ, దీని డిజైన్, సేఫ్టీ కారణంగా చాలా మందిని ఆకర్షిస్తోంది. 2025లో కూడా టియాగో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, డిజైన్‌లో చిన్నచిన్న మార్పులు, కొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన వేరియంట్లతో మార్కెట్లో విజయవంతమవుతోంది. ప్రస్తుతం ఇది అత్యంత తక్కువ ధరకు అమ్మకానికి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు చూద్దాం. టాటా టియాగో తక్కువ బడ్జెట్‌లో అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలతో పాటు ఆకర్షణీయమైన డిజైన్‌ కలిగి ఉండటంతో ఇది మిడ్-రేంజ్ కారు సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 2025లో టియాగోను బేస్ మోడల్ నుంచి టాప్ వేరియంట్ వరకు మొత్తం 12 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

 

ఇది కూడా చదవండి: కష్టం ముందు ఏ కల పెద్దది కాదు.. ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ - అభినందించిన సీఎం, లోకేశ్!

 

ఇందులో పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వేరియంట్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. బేస్ వేరియంట్ ధర దాదాపు రూ. 5 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కాగా, టాప్ వేరియంట్ రూ. 8.45 లక్షలు. ఇవి అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ చిన్న కారుకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ఫిబ్రవరి 2025లోనే దాదాపు 7,000 యూనిట్లు అమ్ముడుపోవడం దీని డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యంగా పెట్రోల్ వెర్షన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోడల్‌కి కూడా మార్కెట్లో మెరుగైన స్పందన లభించింది. ఈ కారును ఎక్కువ మంది కస్టమర్లు కొనుగోలు చేయడానికి మరో పెద్ద ప్లస్ పాయింట్ సేఫ్టీ. ఇది 2020లో గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ రేటింగ్‌ను పొందింది. అంటే ఇది చిన్నదైనా కూడా ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు సేఫ్టీని అందిస్తుంది. ఇది ముఖ్యంగా ఫ్యామిలీ కోసం చూసే కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టాటా టియాగోను చిన్న కారు అనుకుంటూ తక్కువ అంచనాలతో చూడవద్దు. కొత్త టియాగో రెండు శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తోంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, అదే కెపాసిటీ కలిగిన సీఎన్‌జీ ఇంజిన్ అందుబాటులో ఉన్నాయి. రోజువారి ప్రయాణాలు చేసే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, వేరియంట్‌లను బట్టి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందించారు. మైలేజీ పెట్రోల్ వేరియంట్ 19.43 కిలోమీటర్లు అందిస్తుండగా, సీఎన్‌జీ వేరియంట్‌ 28.06 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారులో డజన్ల కొద్ది ఫీచర్స ఉన్నాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, 4-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బకీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఆటో-ఫోల్డింగ్ అవుట్‌సైడ్ సైడ్ మిర్రర్‌లు వంటి పలు ఆప్షన్లు ఈ కారులో ఉన్నాయి. హైదరాబాద్‌లో టాటా టియాగో ఎక్స్‌ఈ పెట్రోల్ బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.4.99 లక్షల వరకు అదే ఆన్‌‌రోడ్ ధర వచ్చేసి రూ. 5.96 లక్షల వరకు ఉంది. దీని సీఎన్‌జీ ఎక్స్‌ఈ బేస్ వేరియంట్ విషయానికి వస్తే రూ. 7.18 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.


ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Car #Offer #NewCar #SUv #Hondacar